Phone Colour: మీరెలాంటి వారో మీ ఫోన్‌ రంగు చూసి చెప్పేయొచ్చట!

మనం వాడే ఫోన్‌ కలర్‌ మన వ్యక్తిత్వాన్ని కూడా సూచిస్తుందట. ఈ విషయాన్ని ప్రముఖ కలర్‌ సైకాలజిస్ట్ మాథ్యు వివరించారు.

Updated : 11 May 2022 18:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ కొనే ముందు కొంతమంది దాని ఫీచర్లతో పాటు ముఖ్యంగా కలర్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. నచ్చిన మోడళ్లలో వారికి ఇష్టమైన కలర్‌ ఉందా? లేదా? అని చెక్‌ చేసి మరి కొంటారు. ఇక.. ఏ కలర్‌ అయితే ఏముంది? ఫోన్‌ బాగుంది.. ఫీచర్లు అదిరిపోయాయని తీసుకునే వారుంటారు. అది వేరే విషయం. కానీ, కొంతమంది మాత్రం కలర్‌ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ కారు. అలాంటి వారి వ్యక్తిత్వం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. మనం వాడే ఫోన్‌ కలర్‌ మన వ్యక్తిత్వాన్ని కూడా సూచిస్తుందట. ఈ విషయాన్ని ప్రముఖ కలర్‌ సైకాలజిస్ట్ మాథ్యూ తన బ్లాగ్‌ పోస్టులో వెల్లడించారు. అయితే ఏ రంగు స్మార్ట్‌ఫోన్ వాడే వారికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుందో ఓసారి చూద్దాం..


నలుపు (Black)..

నలుపు రంగు అంటేనే అశుభానికి గుర్తుగా చాలా మంది ఫీల్‌ అవుతారు. కానీ, స్మార్ట్‌ఫోన్‌ విషయానికి వచ్చే సరికి ఆ సెంటిమెంట్‌ను కాస్త పక్కన పెడతారు. దాదాపు అన్ని రకాల కంపెనీ ఫోన్లు ఈ కలర్‌లో అందుబాటులో ఉండటం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. చాలా మంది నలుపు రంగు ఫోన్లను కొనడానికి మొగ్గు చూపుతారట. ఎందుకంటే ఇది చాలా సేఫెస్ట్‌ కలర్‌ అని భావిస్తారట. అంతేకాకుండా ఈ కలర్‌ ఫోన్లు స్టైలిష్‌ లుక్‌లో ఉంటూ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. నలుపు రంగు స్మార్ట్‌ఫోన్‌ వాడేవారు వృత్తి నైపుణ్యం, గాంభీర్యం, శక్తిమంతంగా ఉండటంతో పాటు మోడ్రన్‌గా ఆలోచిస్తూ ఉంటారట. ‘నలుపు రంగు అనేది గోప్యత, ప్రవృత్తికి బలమైన సూచిక’ అని మాథ్యూ పేర్కొన్నారు.


నీలం (Blue)..

నలుపు రంగు తర్వాత చాలా మంది నీలం (బ్లూ) కలర్‌ స్మార్ట్‌ఫోన్లపైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈ కలర్‌ ఫోన్లను ఇష్టపడే వ్యక్తులు రిజర్వ్‌డ్‌గా, ప్రశాంతంగా ఉంటారట. ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటిస్తారట. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించడం, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారట.


తెలుపు (White).. 

తెలుపు రంగు స్మార్ట్‌ఫోన్‌ను వాడే వ్యక్తులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటారాట. అన్ని విషయాలను దాచుకోకుండా బహిరంగంగా మాట్లాడాలని చూస్తారట. అదే క్రమంలో ఉన్నత ప్రమాణాలను కూడా కలిగి ఉంటారట. ‘‘తెలుపు రంగు స్వచ్ఛతకు మారుపేరు. ఆ రంగు స్మార్ట్‌ఫోన్‌ వాడేవారు అన్ని విషయాల్లో తాము యజమానుల్లా ఫీల్ అవుతారు’’ అని మాథ్యూ పేర్కొన్నారు.


ఎరుపు (RED)..

ఎరుపు రంగు స్మార్ట్‌ఫోన్లను చాలా అరుదుగా ఇష్టపడతారు. అయితే, ఐఫోన్‌ మాత్రం రెడ్ కలర్‌ చాలా మంది ఇష్టపడుతున్నట్లు గుర్తించి వివిధ మోడళ్లను రెడ్‌ కలర్‌లోనే విడుదల చేస్తూ వస్తోంది. ఈ రంగు ఇష్టపడేవారు దూకుడుగా ప్రవర్తిస్తారట. వీరిలో పోటీతత్వం కూడా ఎక్కువగా ఉంటుందట. ఇతరుల దృష్టిని తమ వైపు మళ్లించేందుకే రెడ్‌ కలర్‌ ఫోన్లను కొనుగోలు చేస్తారట.


బంగారం (GOLD)..

బంగారు రంగు సంపదకు సూచికగా నిలుస్తోంది. ఈ కలర్‌ ఫోన్లు వాడే వారు హుందాగా ఉంటారట. ఉదారత భావంతో మెలుగుతారట. తమ సోషల్ స్టేటస్‌ గురించి తెలుసుకుంటూ ఉంటారట. ఆర్థికంగా ఎంత సక్సెస్‌ అయ్యారో తెలుసుకుంటారని.. లగ్జరీ వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని మాథ్యూ తన బ్లాగ్‌ పోస్టులో రాసుకొచ్చారు.

గమనిక: పై విషయాలు ప్రముఖ సైకాలజిస్ట్‌ మాథ్యూ అంచనా వేసి చెప్పినవి. ప్రతి ఒక్కరిలో ఇలాంటి లక్షణాలే కచ్చితంగా ఉంటాయని చెప్పలేం.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని