Youtube: యూట్యూబ్‌ ప్రీమియం వాడుతున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌!

యూట్యూబ్‌ ప్రీమియంను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారా..? కొన్నేళ్లుగా మీ సబ్‌స్క్రిప్షన్‌కు బ్రేక్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌. యూట్యూబ్‌ ప్రీమియంను చాలా కాలంగా ఉపయోగిస్తున్న యూజర్లకు ఏడాదిపాటు యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ సేవలు ఉచితంగా అందివ్వనున్నట్లు సమాచారం.

Published : 14 Jun 2022 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూట్యూబ్‌ ప్రీమియంను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారా..? కొన్నేళ్లుగా మీ సబ్‌స్క్రిప్షన్‌కు బ్రేక్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌. యూట్యూబ్‌ ప్రీమియంను చాలా కాలంగా ఉపయోగిస్తున్న యూజర్లకు ఏడాదిపాటు యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ సేవలు ఉచితంగా అందివ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు రెడిట్ యూజర్‌ ఒకరు తన ఖాతాలో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. సదరు యూజర్‌ యూట్యూబ్‌ ప్రీమియంను ఆరేళ్ల నుంచి సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నట్లు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం అతని యూట్యూబ్‌ మ్యూజిక్‌ పేజ్‌లో టైమ్‌ టు సెలబ్రేట్‌ (Time To Celebrate) అని పాప్‌-అప్‌ మెసేజ్‌ ప్రత్యక్షమవడంతో, దానిపై క్లిక్ చేయగా ‘‘ మీ మద్దతుకు ధన్యవాదాలు. మీ కోసం మేము ఒక ముఖ్యమైన దాన్ని ప్రారంభించాము. మీకు యూట్యూబ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాడ్‌-ఫ్రీ, ఆఫ్‌లైన్‌ సేవలు ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నాం’’ అని ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఆఫర్‌ అన్ని ప్రాంతాలలోని యూజర్లు వర్తిస్తుందా? లేక ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమేనా? అనేది తెలియాల్సి ఉంది. 

ఒకవేళ మీరు యూట్యూబ్‌ ప్రీమియంను సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లయితే, సబ్‌స్క్రిప్షన్‌ తేదీని ఈ కింది విధంగా తెలుసుకోవచ్చు. 

* ఆండ్రాయిడ్/ఐఓఎస్‌ డివైజ్‌లలో యూట్యూబ్‌ యాప్‌ ఓపెన్ చేసి కుడివైపు పైభాగంలో ఉన్న ప్రొఫైల్‌ ఫొటో (Profile Photo) పై క్లిక్ చేయాలి. 

* అందులో యూట్యూబ్‌ ప్రీమియం బెనిఫిట్స్‌ (YouTube Premium Benefits) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 

* దానిపై క్లిక్ చేస్తే యూజర్‌ నేమ్‌ (User Name) కింద మెంబర్ సిన్స్‌ (Member Since) అని సబ్‌స్క్రిప్షన్‌ తేదీ కనిపిస్తుంది. 

ప్రస్తుతం భారత్‌లో యూట్యూబ్ ప్రీమియం నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ. 139గా ఉంది. ఒకవేళ మీరు ఆటో-రెన్యువల్‌ (Auto-Renewal) ఆప్షన్ ఎనేబుల్ చేసి సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే రూ. 129కే నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. అలానే మూడు నెలలకు రూ. 399, ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ. 1,290గా ఉంది. విద్యార్థులకు ప్రత్యేక రాయితీ కింద నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రూ. 79కే లభిస్తుంది. అయితే విద్యార్థులు తప్పకుండా స్టూడెంట్ ఐడీని సబ్‌మిట్ చేయాలి. యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో యూజర్లు యాడ్‌-ఫ్రీ కంటెంట్‌ను ఆస్వాదించడంతోపాటు, నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో చూడొచ్చు. అలానే బ్యాక్‌గ్రౌండ్‌, పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ ప్లేబ్యాక్‌ వంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని