YouTube: యూట్యూబ్‌కు 17 ఏళ్లు.. తొలిసారి అప్‌లోడ్‌ చేసిన వీడియో చూశారా?

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌కు 17 ఏళ్లు నిండాయి. అసలు యూట్యూబ్‌ ఎప్పుడు స్టార్ట్‌ అయ్యింది. అందులో అప్‌లోడ్‌ చేసిన తొలి వీడియో ఏంటి?

Updated : 11 May 2022 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఇంటర్నెట్‌ లేని ఫోన్‌ లేదు.. యూట్యూబ్‌ చూడని నెటిజన్‌ లేడంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌ సాయంతో యూట్యూబ్‌ను తెగ చూసేస్తున్నారు. మరి ఇంతలా ఉపయోగిస్తున్న యూట్యూబ్‌ అసలు ఎప్పుడు స్టార్ట్‌ అయ్యింది. అందులో అప్‌లోడ్‌ చేసిన తొలి వీడియో ఏంటి? ఎవరు, ఎక్కడ తీశారనే విషయాలు చూద్దాం..


యూట్యూబ్.. తొలిసారిగా ఫిబ్రవరి 14, 2005లో ప్రారంభమైంది. 2005 ఏప్రిల్‌ 24న మొదటి వీడియో ఇందులో అప్‌లోడ్‌ చేశారు. అంటే ఇప్పటికీ 17 ఏళ్లు నిండాయి. దీన్ని అమెరికాకు చెందిన ముగ్గురు సహోద్యోగులు స్టీవ్‌ చేన్‌, చాద్‌ హర్లే, జావేద్‌ కరీం కలిసి స్థాపించారు. ఇందులో జావేద్‌ కరీం మాట్లాడిన 18 సెకన్ల వీడియోను తొలిసారిగా అప్‌లోడ్‌ చేశారు. కాలిఫోర్నియా శాన్‌డియాగోలోని ఒక జూలో ఈ వీడియోను చిత్రీకరించారు. ‘‘మేం ఏనుగుల ముందు ఉన్నాం. ఇవి పెద్ద పెద్ద తొండాలను కలిగి ఉన్నాయి’’ అంటూ కెమెరాను చూసుకుంటూ మాట్లాడినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 228 మిలియన్ల మంది వీక్షించారు. అంతేకాకుండా 11 మిలియన్ల కామెంట్స్‌ కూడా వచ్చాయి.

2005లో వీడియో అప్‌లోడ్‌ తర్వాత యూట్యూబ్‌కు నెమ్మదిగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన గూగుల్‌ 2006లో 1.65 బిలియన్‌ డాలర్లకు యూట్యూబ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం గూగుల్‌ ఆదాయ వనరుల్లో యూట్యూబ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో యూట్యూబ్‌ 8.6 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చింది. 2021 గణాంకాల ప్రకారం.. యూట్యూబ్‌కు 2.6 బిలియన్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్లు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు