YouTube: ఓటీటీ తరహా సేవలతో యూట్యూబ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌‌!

వీడియో ఫ్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ త్వరలో కొత్త సర్వీస్‌లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఓటీటీ తరహాలో వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం యూట్యూబ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

Updated : 22 Nov 2022 16:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీడియో ఫ్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ త్వరలో కొత్త సర్వీస్‌లను యూజర్లకు పరిచయం చేయనుంది. ఓటీటీ తరహాలో వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం యూట్యూబ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. రోకు, యాపిల్‌ వంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. యూట్యూబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవల్లో భాగంగా కొత్త సర్వీస్‌లను ప్రారంభించనుంది. గత ఏడాదిన్నర కాలంగా వీడియో స్ట్రీమింగ్‌ సేవలకు సంబంధించి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సేవలను యూజర్లకు పరిచయం చేస్తారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం ఎక్కువ మంది యూజర్లు కేబుల్‌, శాటిలైట్ టీవీ సర్వీసులకు బదులుగా సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత ఓటీటీ, స్ట్రీమింగ్‌ సేవలవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో యూజర్ల అభిరుచికి తగ్గట్లుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు స్ట్రీమింగ్‌ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ కూడా కొత్తగా వీడియో స్ట్రీమింగ్‌ కోసం ఆన్‌లైన్‌ స్టోర్‌ను తీసుకురానుంది. 

ఇటీవలే యూట్యూబ్‌ పెద్ద వీడియోల నుంచి సులువుగా షార్ట్స్‌ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో కంటెంట్‌ క్రియేటర్స్‌ పెద్ద వీడియోల నుంచి 60 సెకన్ల కన్నా తక్కువ నిడివితో షార్ట్స్‌ క్రియేట్‌ చేయొచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా క్రియేట్‌ చేసిన షార్ట్స్‌కు కంటెంట్ డెవలపర్‌ ఎక్కువ నిడివి ఉన్న వీడియో లింక్‌ను యాడ్‌ చేయొచ్చు. దాంతో షార్ట్స్‌ పూర్తయిన వెంటనే ఒరిజినల్‌ వీడియోకు వ్యూయర్‌ను రీడైరెక్ట్ చేస్తుందని యూట్యూబ్‌ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని