Zomato: బగ్‌ పట్టెయ్‌... బహుమతి కొట్టేయ్‌..!

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్ జొమాటో ఎథికల్ హ్యాకర్స్‌కి అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో బగ్‌ను కనిపెడితే 100 డాలర్ల నుంచి 4,000 డాలర్లు వరకు ప్రైజ్ మనీ అందివ్వనున్నట్లు తెలిపింది. అయితే బగ్‌ తీవ్రత ఆధారంగా ప్రైజ్‌ మనీ నిర్ణయిస్తామని వెల్లడించింది...

Published : 12 Jul 2021 23:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్ జొమాటో ఎథికల్ హ్యాకర్స్‌కి అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో బగ్‌ను కనిపెడితే 100 డాలర్ల (సుమారు రూ.7,500) నుంచి 4,000 డాలర్లు (రూ.3 లక్షల) వరకు ప్రైజ్ మనీ అందివ్వనున్నట్లు తెలిపింది. అయితే బగ్‌ తీవ్రత ఆధారంగా ప్రైజ్‌ మనీ నిర్ణయిస్తామని వెల్లడించింది. అలానే హ్యాకర్స్ కనిపెట్టిన బగ్ ఎంత తీవ్రమైందనేది జొమాటో సైబర్ సెక్యూరిటీ నిర్ణయిస్తుందని తెలిపింది. ఒకవేళ బగ్ వల్ల కంపెనీకి పెద్ద ప్రమాదం లేదనుకుంటే తక్కువ నగదు చెల్లిస్తారు. 

బగ్ బౌంటీలో భాగంగా  హ్యాకర్స్ ఎవరైనా పొరపాటున నిబంధనలు అతిక్రమించినా తాము ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టమని జొమాటో తెలిపింది. ‘‘మా వెబ్‌ లేదా యాప్‌లను భద్రతా పరంగా మరింత మెరుగుపరచాలనే ఆలోచనతో జొమాటో బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ప్రారంభించాం. అలానే ఈ ప్రోగ్రాం హ్యాకర్స్‌కి చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మీరు భాగస్వామ్యం అవుతున్నందుకు కృతజ్ఞతలు. మీరు అందించే బగ్‌ రిపోర్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం’’ అని జొమాటో ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని