Zoom: ఎక్కడెక్కడ ఉన్నా ఒకేచోట ఉన్నట్లు

గ్రూప్‌ కాల్స్‌/కాన్ఫరెన్స్‌ కోసం Immersive view తీసుకొచ్చిన జూమ్‌... 

Updated : 27 Apr 2021 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆఫీసు మీటింగ్‌, కంపెనీ సెమీనార్‌లు, స్కూలు పాఠాలు... ఇవన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో సాగిపోతున్నాయి. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌లో  వర్చువల్‌గా మీటింగ్‌లు నిర్వహించేస్తున్నారు. అయితే ఎక్కడో ఏదో చిన్న వెలితి. మీటింగ్‌లో సెమినార్‌  చెప్పే వక్తలు పక్కపక్కన కూర్చుంటే బాగుంటుంది కదా. క్లాస్‌ రూమ్‌లో పిల్లలు హాలు మొత్తం కూర్చున్నట్లు ఉంటే బాగుండు కదా! ఇదేదో బ్లాక్స్‌లో ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నారు. అయితే త్వరలో ఈ ఇబ్బంది ఉండదు. ఇమ్మెర్సివ్‌ వ్యూ పేరుతో జూమ్‌కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ఆ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే... పైన ఫొటోలు కనిపించినట్లుగా అందరూ ఇలా పక్కపక్కన చేరిపోతారు. లేదంటే కింది ఫొటో తరహాలో  గదిలో కూర్చున్నట్లు ఉంటారు. 

జూమ్‌లో మాట్లాడుతున్న వ్యక్తి బ్యాగ్రౌండ్‌ మార్చుకోవచ్చనే విషయం మీకు తెలిసిందే. మీకు నచ్చిన ఇమేజ్‌/ జూమ్‌ ఇచ్చిన డీఫాల్ట్‌ ఇమేజ్‌లను వర్చువల్‌ బ్యాగ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ఆప్షన్‌ను ఇంకాస్త మెరుగుపరుస్తూ ఇమ్మెర్సివ్‌ వ్యూను తీసుకొస్తోంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఒక గదిలో ఐదారు స్థానాలు కనిపిస్తాయి. అందులో టేబుల్‌  దగ్గర (పైన ఒకటో ఫొటోలో ఉన్నట్లు)  సమావేశంలో కూర్చున్నట్లుగా అడ్జెస్ట్‌ చేయొచ్చు. అవసరమైతే బ్యాగ్రౌండ్‌ను కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. మొత్తం సెటప్‌ను క్లాస్‌ రూమ్‌గా మార్చేయాలన్నా, రెస్టరెంట్‌గా చూపించాలన్నా వీలవుతుంది. అయితే ఈ మార్పులు, ఫీచర్‌ కేవలం హోస్ట్‌కు మాత్రమే వీలవుతాయి. గరిష్ఠంగా 24 మంది పార్టిసిపెంట్స్‌ వరకే ఇమ్మెర్సివ్‌ వ్యూ పని చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ విదేశాల్లో కొంతమందికి అందుబాటులో ఉంది. త్వరలో మన దేశంలోనూ లైవ్‌లోకి తీసుకొస్తారు. అన్నట్లు ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి జూమ్‌ డెస్క్‌ టాప్‌ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మొబైల్‌కు ఎప్పుడు తీసుకొస్తారో తెలియాల్సి ఉంది. అయితే ఇదే తరహా ఫీచర్‌ మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ఉంది. అక్కడ దానికి ‘టుగెదర్‌ మోడ్‌’ అని పిలుస్తారు. 

* జూమ్‌ డెస్క్‌టాప్‌ యాప్‌లో కాల్‌ / కాన్ఫరెన్స్‌ కనెక్ట్‌  అవ్వాలి. ఆ తర్వాత రైట్‌ సైడ్‌ టాప్‌ కార్నర్‌లో  వ్యూ ఆప్షన్‌ వస్తుంది. అందులో స్పీకర్‌ వ్యూ, గ్యాలరీ వ్యూ, ఇమ్మెర్సివ్‌ వ్యూ అని వస్తుంది. అందులోంచి ఇమ్మెర్సివ్‌ వ్యూ ఎంచుకోవాలి. 

* ఇమ్మెర్సివ్‌ వ్యూ ఎంచుకున్నాక కొన్ని లే అవుట్‌లో  మీటింగ్ పార్టిసిపెంట్స్‌ను అడ్జెస్ట్‌ చేసుకోవాలి. ముందుగా చెప్పినట్లు 25 మంది వరకే ఈ ఆప్షన్‌ పని చేస్తుంది. 

* ఈ ఫీచర్‌ పని చేయాలంటే కాల్‌/కాన్ఫరెన్స్‌లో ఉన్న యూజర్లందరూ కొత్త వెర్షన్‌ జూమ్‌ యాప్‌ను వాడుతుండాలి. 

* కాల్‌/కాన్ఫరెన్స్‌లో 25 మంది కంటే ఎక్కువమంది ఉంటే... మిగిలినవాళ్లు థంబ్‌నైల్‌ వ్యూలో సైడ్‌కి కనిపిస్తారు. 

* ఇమ్మెర్సివ్‌ వ్యూలో ఉన్నప్పుడు కాల్‌ రికార్డింగ్‌ ఆప్షన్‌ పని చేయదు. అంటే రికార్డు అవుతుంది కానీ.. ఆ వీడియో గ్యాలరీ వ్యూ, లేదా స్పీకర్‌ లే అవుట్‌లో కనిపిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని