ఆరోగ్య సేతు’ డౌన్‌లోడ్‌ల సంఖ్య తెలుసా!

కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

Published : 19 Apr 2020 00:43 IST

ఆరు కోట్లు దాటినట్లు కేంద్ర మంత్రి వెల్లడి

న్యూదిల్లీ: కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ శనివారం ట్విటర్‌ వేదికన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవాసులంతా నిబద్ధతగా కరోనాపై పోరాడుతున్నారనే విషయాన్ని ఈ సంఖ్య స్పష్టం చేస్తోందన్నారు. మహమ్మారి కట్టడిలో భారత్‌ ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లో అత్యంత వేగంగా 5 కోట్ల డౌన్‌లోడ్‌లు పూర్తి చేరుకున్న యాప్‌గా ఆరోగ్యసేతు రికార్డు సృష్టించినట్లు నీతిఆయోగ్‌ ఇటీవలే వెల్లడించింది. కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు దగ్గరగా వెళ్లినప్పుడు బ్లూటూత్‌, లోకేషన్‌ ట్రాకింగ్‌ ఆధారంగా ఈ యాప్‌ మనల్ని అప్రమత్తం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని