Monkeypox: మంకీ పాక్స్‌ ఉద్ధృతి దృష్ట్యా అప్రమత్తమైన తెలంగాణ వైద్యారోగ్యశాఖ

పలు దేశాల్లో మంకీ పాక్స్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. మంకీ పాక్స్‌ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్లో ఉంచనున్నట్టు  వైద్యారోగ్యశాఖ

Published : 28 May 2022 17:46 IST

హైదరాబాద్‌: పలు దేశాల్లో మంకీ పాక్స్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. మంకీ పాక్స్‌ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్లో ఉంచనున్నట్టు  వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల మంకీ పాక్స్‌ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారు, ఒంటిపై రాషెస్‌ వచ్చిన వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులను అదేశించింది. అనుమానితులు జిల్లా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. అనుమానితుల రక్త నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీకి పంపనున్నట్టు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని