CM KCR: రెండు మూడు నెలల్లో సంచలన ప్రకటన: సీఎం కేసీఆర్‌

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్‌, సాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 26 May 2022 17:23 IST

బెంగళూరు: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ దేశంలో మంచినీరు, విద్యుత్‌, సాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ సమావేశమయ్యారు. అనంతరం కుమారస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

దేవెగౌడ, కుమారస్వామితో జాతీయ, కర్ణాటక రాజకీయాలపై చర్చించినట్లు కేసీఆర్‌ చెప్పారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని.. దీన్ని ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్‌, భాజపా పాలనలో ఎవరూ సంతోషంగా లేరని.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయిందన్నారు. జీడీపీలో భారత్‌ను చైనా అధిగమించిందన్నారు. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా భారత్‌ను తీర్చిదిద్దొచ్చని చెప్పారు. ఉజ్వల భారత్‌ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని