CM KCR: మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి పైకొచ్చాం: కేసీఆర్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడతామని.. మెరుగైన వసతులు

Published : 08 Mar 2022 14:28 IST

వనపర్తి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడతామని.. మెరుగైన వసతులు కల్పిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. వనపర్తిలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని వనపర్తి నుంచి ప్రారంభించడం ఈ జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. తామంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి పైకి వచ్చామని చెప్పారు.  ఈరోజు మీముందు ఇలా నిలచున్నామంటే ప్రభుత్వ పాఠశాలల్లో తమ గురువులు చెప్పిన విద్యే కారణమన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలనేది తమ లక్ష్యమని తెలిపారు. 

అనంతరం వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ సమీకృత భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. సాయంత్రం ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడి మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని