TS News: 317 జీవో రద్దయ్యే వరకు ఉపాధ్యాయులకు అండగా ఉంటాం: రేవంత్‌రెడ్డి

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రగతిభవన్‌ వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతల  అరెస్టును రేవంత్‌రెడ్డి ఖండించారు.

Published : 16 Jan 2022 03:54 IST

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రగతిభవన్‌ వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతల  అరెస్టును రేవంత్‌రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ బద్ధంగా ప్రగతి భవన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన టీచర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందని, వారి పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. 317 జీవో రద్దయ్యే వరకు ఉపాధ్యాయుల పోరాటంలో వెన్నంటి ఉంటూ కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించే 317 జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలుగు ప్రజలకు అత్యంత సంప్రదాయ పండుగ సంక్రాంతి పర్వదినం నాడు ఉపాధ్యాయ సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండా అరెస్టులు చెయ్యడం దారుణమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని