Srinivas goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర.. నలుగురి అరెస్టు

తెలంగాణమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు సుపారీ గ్యాంగ్‌తో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సోదరుడు

Updated : 02 Mar 2022 20:28 IST

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఆయన అనుచరుల హత్యకు పన్నిన కుట్రను ఛేదించినట్టు సైబరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. సుపారీ గ్యాంగ్‌తో హత్యకు ప్రణాళిక రచించినట్టు అనుమానిస్తున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తులు.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్‌గౌడ్‌ను లక్ష్యంగా చేసినట్టు అనుమానిస్తున్నారు.

రూ.12కోట్లకు సుపారీ ఒప్పందానికి ఫరూక్‌ అనే వ్యక్తిని సంప్రదించగా.. అతడు పేట్‌బషీర్‌బాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు కుట్రలో భాగస్వాములైన మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లపై గతంలోనూ హత్య కేసులు ఉన్నాయి. ఈ ముగ్గురినీ హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు.. నాగరాజు ఇచ్చిన సమాచారంతో హత్య కుట్రలో భాగస్వామి రఘును అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో భాజపా నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో రఘును పోలీసులు అరెస్టు చేశారు. రఘుకు ఆశ్రయమిచ్చిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. హత్య కుట్రకోణాన్ని సైబరాబాద్‌ పోలీసులు .. దిల్లీ పోలీసులకు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని