Hyderabad: 30 కేసుల్లో నిందితుడు.. పారిపోయేందుకు పోలీస్‌స్టేషన్‌ 2వ అంతస్తు నుంచి దూకి..

హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ నుంచి ఓ నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. పీఎస్‌ రెండో అంతస్తు వెనక నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

Published : 22 May 2022 01:47 IST

ఎస్‌ఆర్‌ నగర్‌: హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ నుంచి ఓ నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. పీఎస్‌ రెండో అంతస్తు వెనక నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కృష్ణ అనే పాత నేరస్తుడిని విచారణ నిమిత్తం అమీర్‌పేటలో అదుపులోకి తీసుకుని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. పలువురు అమ్మాయిలను మోసం చేసిన కేసులతో కలిపి కృష్ణపై దాదాపు 30 కేసులు ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటల సమయంలో తప్పుంచుకునే ప్రయత్నంలో పోలీసు స్టేషన్‌లోని రెండో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పంజాగుట్ట ఏసీపీ గణేష్‌.. ఎస్‌ఆర్‌ నగర్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని