వెలుగులోకి అరుదైన ‘వీరగల్లు’

రాష్ట్రంలో మరో నాలుగు అరుదైన శిల్పాలు వెలుగులోకి వచ్చాయని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ ప్రకటించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం

Published : 24 May 2021 06:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో నాలుగు అరుదైన శిల్పాలు వెలుగులోకి వచ్చాయని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ ప్రకటించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులోని సోమరాజుకుంటలో తాజాగా నాలుగు శిల్పాలను గుర్తించినట్లు బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. వీటిలో రెండు వీరగల్లులు (వీరుడి స్మారక శిల్పాలు) కాగా ఒకటి నాగలింగం, మరొకటి రాష్ట్రకూటుల కాలం నాటి కాలభైరవ శిల్పమని వెల్లడించారు. ‘‘రెండు వీరగల్లుల శిల్పాల్లో ఒకటి రాష్ట్రకూటుల కాలానికి చెందినది. ఇది అరుదైన, అద్భుతమైన, నిలువెత్తు వీరగల్లు. వీరుడు సర్వాభరణాలు ధరించి కుడిచేత్తో బాణం, ఏడమచేతిలో విల్లు, నడుమున పట్టాకత్తి ధరించి యుద్ధసన్నద్ధుడై ఉన్నట్లుగా ఉంది. ఆ వీరుడు అమరుడు అయ్యాడని చెప్పటానికి సూచనగా ఇద్దరు అప్సరాంగనలు వీరుని తలకు ఇరువైపులా నిల్చున్నట్లుగా ఆ శిల ఉంది. రెండో వీరగల్లు కాకతీయశైలిలో చెక్కింది’’ అని హరగోపాల్‌ వివరించారు. బృంద సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ వీటిని గుర్తించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని