సహాయ ఆచార్యుల పోస్టుకు పీహెచ్‌డీ తప్పనిసరి

విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుడి(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) కొలువులకు పోటీపడాలంటే పీహెచ్‌డీ తప్పనిసరి. వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలపై యూజీసీ 2018లో జారీచేసిన

Updated : 15 Jul 2021 05:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుడి(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) కొలువులకు పోటీపడాలంటే పీహెచ్‌డీ తప్పనిసరి. వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలపై యూజీసీ 2018లో జారీచేసిన నిబంధనలు ఈనెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అంటే రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 1061 బోధనా సిబ్బంది(సహాయ, సహ ఆచార్యులు, ఆచార్యులు) నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వాటికి పోటీపడాలంటే పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండటం తప్పనిసరి అవుతోంది. ఈ నిబంధనతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న దాదాపు 1300 మంది ఒప్పంద అధ్యాకుల్లో సుమారు 50 శాతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కోల్పోతారని అంచనా. 1061 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినా.. ఉమ్మడి వడపోత పరీక్ష నిర్వహించినా 6 వేల మంది పోటీపడవచ్చని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని