ఆదాయం పెంచకపోతే ఇంటికే..

హరిత హోటళ్లలో గదుల నిర్వహణ, ఆహార నాణ్యత, బోటింగ్‌ సేవల్ని మరింత మెరుగు పరచాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీడీసీ) నిర్ణయించింది. కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అధ్యక్షతన అధికారులు

Updated : 07 Sep 2021 05:01 IST

ఉద్యోగులకు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ హెచ్చరిక

ఈనాడు, హైదరాబాద్‌: హరిత హోటళ్లలో గదుల నిర్వహణ, ఆహార నాణ్యత, బోటింగ్‌ సేవల్ని మరింత మెరుగు పరచాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీడీసీ) నిర్ణయించింది. కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అధ్యక్షతన అధికారులు, అన్నివిభాగాల ఉద్యోగులతో హైదరాబాద్‌లో సోమవారం సమావేశం జరిగింది. పర్యాటకుల్ని ఆకట్టుకునే పద్ధతులతో పాటు సేవల్ని మెరుగుపర్చడంపై నిపుణులతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ.. కొవిడ్‌ రెండో దశ తర్వాత పర్యాటకం మెల్లమెల్లగా పుంజుకుంటోందన్నారు. పీఆర్సీ ప్రకారం నూతన వేతనాల అమలును ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు కార్పొరేషన్లలోనే అమలు చేశారని అందులో పర్యాటక అభివృద్ధి సంస్థ ఒకటని అన్నారు. ఆదాయం పెరిగేలా పనిచేయకపోతే ఉద్యోగుల్ని తొలగించడం, ఇతర విభాగాలకు మార్చడం లాంటి కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పర్యాటకుల్ని ఆకర్షించడంలో ప్రైవేటు సంస్థల కంటే మిన్నగా ఉండాలని అధికారులు, ఉద్యోగులకు స్పష్టం చేశారు. సమావేశంలో పర్యాటకశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టీడీసీ ఎండీ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని