
ఎంపీని మోసం చేసేందుకు యత్నించిన నిందితుల అరెస్టు
అభిషేక్, బాలాజీ
తిరుపతి: తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తికి ఫోన్ చేసి రాయితీ రుణాల యూనిట్లు మంజూరు చేయిస్తానని.. అందుకు రూ.25 లక్షల నగదు తన బ్యాంకు ఖాతాకు జమ చేయాలని మోసం చేయడానికి యత్నించిన నిందితుడిని హైదరాబాద్ టాస్క్‌పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌లో పనిచేస్తున్నానంటూ ఎంపీకి ఫోన్ చేసి మోసం చేయడానికి అభిషేక్ యత్నించారు. దర్యాప్తులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇతనితోపాటు బాలాజీ నాయుడును అరెస్టు చేశారు. తెలంగాణలో ఇదే తరహాలో నాలుగు మోసాలకు పాల్పడ్డారని సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.