logo

పేదల కోసమే రెండు పడక గదుల ఇళ్లు

ఇల్లు లేదని రాష్టంలో ఎవరూ బాధపడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని వడ్డెపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 36 రెండు పడక

Updated : 20 Jan 2022 06:08 IST

అడ్డాకుల : వడ్డేపల్లిలో ఇళ్లను ప్రారంభిస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎంపీ  శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి

అడ్డాకుల, న్యూస్‌టుడే : ఇల్లు లేదని రాష్టంలో ఎవరూ బాధపడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని వడ్డెపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 36 రెండు పడక గదుల ఇళ్లను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ సాయిచంద్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల వైఫల్యంతో వడ్డెరులకు సొంత ఇళ్లు దక్కలేదన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చొరవతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ప్రారంభించామన్నారు. అందరి సహకారంతో పాలమూరు జిల్లాను ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వడ్డెరల జీవితంలో మరిచిపోలేని బహుమతిని అందించిన తెరాసకు కృతజ్ఞతగా ఉండాలన్నారు. అనంతరం మసాపేట మండలంలోని జానంపేటలో నిర్మించిన 80 రెండు పడక గదుల ఇళ్లు, పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవర్‌, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్‌, నాగార్జునరెడ్డి, కళావతమ్మ, శ్రీకాంత్‌, శ్రీనివాసులు, శామలమ్మ పాల్గొన్నారు.

యూట్యూబ్‌ ఛానళ్ల సంగతి తేలుస్తాం..
చిన్నచింతకుంట : యూట్యూబ్‌ ఛానళ్లు పెట్టుకొని కేసీఆర్‌పై అవాకులు పేలుతున్న వారిని గమనిస్తున్నామని, రెణ్నెల్ల తరవాత సంగతి తేలుస్తామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ సాయిచంద్‌ హెచ్చరించారు. మండల కేంద్రంలో వంతెన కం చెక్‌డ్యాం పనుల ప్రారంభోత్సవానికి మంత్రితోపాటు హాజరైన ఆయన మాట్లాడారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలవి అర్థం లేని ఆరోపణలన్నారు. చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నది ఇసుక తరలించడానికి అని ఓ మాజీ ఎమ్మెల్యే ఆరోపించడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.2.20 కోట్ల చెక్కులను మంత్రి అందించారు. సాట్స్‌ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, రాజేశ్వరి, మోహన్‌గౌడ్‌, ఉషారాణి, కోట రాములు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని