బడులు తెరిచేందుకు చర్యలు తీసుకోండి

కరోనా సాకుతో బడుల మూసివేత తగదని, తెరవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Updated : 24 Jan 2022 05:41 IST

ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

కాచిగూడ, బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: కరోనా సాకుతో బడుల మూసివేత తగదని, తెరవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. పాఠశాలల మూసివేతతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా చదువు దూరమై విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని వాపోయారు.

కరోనా పేరిట మూసివేసిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను తెరవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం హైదరాబాద్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని