‘నుమాయిష్‌-2022’ పునఃప్రారంభం

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్‌-2022) శుక్రవారం సాయంత్రం పునఃప్రారంభమైంది. ఎగ్జిబిషన్‌ సొసైటీ

Updated : 26 Feb 2022 05:58 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్‌-2022) శుక్రవారం సాయంత్రం పునఃప్రారంభమైంది. ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం ఆధ్వర్యంలో సీనియర్‌ సభ్యులు సురేందర్‌జీ, డా.గంగాధర్‌, అశ్వాక్‌ హైదర్‌ మూడు ప్రధాన గేట్ల వద్ద రిబ్బన్‌లు కట్‌ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆదిత్య మాట్లాడుతూ.. నుమాయిష్‌ విజయవంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 50 శాతానికి పైగా స్టాళ్ల నిర్వాహకులు ఇప్పటికే విచ్చేశారని.. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో స్టాళ్లు కొలువుదీరుతాయన్నారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎగ్జిబిషన్‌ను తిలకించవచ్చని, వారాంతాల్లో రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. నుమాయిష్‌ నెలన్నర పాటు కొనసాగనుందని, అయిదేళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు