NTR Jayanthi: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి.. ఎన్టీఆర్‌కు నేతల ఘన నివాళి

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు.

Updated : 28 May 2022 11:08 IST

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు.

ఎన్టీఆర్‌ ప్రధాని కావాల్సింది..

‘ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్‌. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. అయన ప్రధాని మంత్రి కావాల్సింది. జస్ట్‌లో మిస్స్ అయింది. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం’ -మంత్రి మల్లారెడ్డి

ఈ ఉత్సవాలలో పాల్గొనడం మా అదృష్టం.. 

‘ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి. శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం మా అదృష్టం. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనికి తార స్థాయిలో అభిమానులు ఉన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఆయన’- నామా నాగేశ్వరావు

నా పెళ్లి చేసిన వ్యక్తి ఎన్టీఆర్..

‘భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్‌ స్ఫూర్తిని తీసుకోని కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు కూడా అలాంటిదే. నా వద్ద అర్ధ రూపాయి కూడా లేదు.. మంత్రిని చేసి నా పెళ్లి చేసిన వ్యక్తి ఎన్టీఆర్. -మోత్కుపల్లి నరసింహులు

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి.

‘శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకొంటున్నాము. ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే అయన పెట్టిన భిక్షే. అయన ఎప్పుడూ మన గుండెల్లో బతికే  ఉంటారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌. మహిళలకు అస్తిలో హక్కు కల్పించారు.- పరిటాల సునీత

ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం తెదేపా

‘ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వాతంత్ర్యం కల్పించిన మహనీయుడు. మహిళలకు ఆస్తిలో సగం హక్కు కల్పించారు. చంద్రబాబు మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక పరిపుష్టి కల్పించారు. 2020 విజన్‌తో చంద్రబాబు జీనోమ్‌ వ్యాలీ నిర్మించారు. కేసీఆర్, జగన్ ప్రతిపక్ష పార్టీలను ఎదగనీయడం లేదు. ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం తెదేపా పని చేస్తుంది.- బక్కని నరసింహులు, తెతెదేపా అధ్యక్షుడు

పేదలను దేవుళ్లుగా భావించిన వ్యక్తి ఎన్టీఆర్‌..
‘ఎన్టీఆర్ రాజకీయాలకు మార్గదర్శి. నా లాంటి వాళ్లను ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటారు. బడుగు బలహీన వర్గాలకు కూడు, గుడ్డ, గూడు కల్పించిన మహానీయుడు. పేదలను దేవుళ్లుగా భావించిన వ్యక్తి. పటేల్, పట్వారీ వ్యవస్థను రూపుమాపారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ పని చేయాలి. ఎన్టీఆర్ భూమి శిస్తు తొలగిస్తే.. కేసీఆర్ ధరణి పేరుతో జేబులు గుల్ల చేస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ గాలికి వదిలేసి... భారతరత్న ఇవ్వాలని కోరుతామనడం హాస్యాస్పదంగా ఉంది. రాజకీయ లబ్ది కోసమే తెరాస ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. కేసీఆర్ తక్షణమే అవినీతిని రూపుమాపాలి. కేసీఆర్ స్పందించకుంటే ఖాకీ దుస్తులు ధరించి.. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తా - నాగం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని