logo

గంజాయి కేంద్రాలుగా వసతిగృహాలు!

ఇటీవల హనుమకొండ ఠాణా నయీంనగర్‌లో రెండు వసతి గృహల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి సేవిస్తున్న అయిదుగురు విద్యార్థులను పట్టుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ వచ్చారు. గంజాయి సరఫరా చేస్తున్న పాలకుర్తి మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తిని చెందిన అరెస్టు చేశారు. కొంతకాల కిందట రాంనగర్‌లో కొత్తగూడెం పట్టణానికి చెందిన యువకుడు ఇక్కడ వసతి గృహంలో ఉంటూ గంజాయి విక్రయిస్తుండగా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

Updated : 30 Jun 2022 07:14 IST

ఇటీవల హనుమకొండ ఠాణా నయీంనగర్‌లో రెండు వసతి గృహల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి సేవిస్తున్న అయిదుగురు విద్యార్థులను పట్టుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ వచ్చారు. గంజాయి సరఫరా చేస్తున్న పాలకుర్తి మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తిని చెందిన అరెస్టు చేశారు. కొంతకాల కిందట రాంనగర్‌లో కొత్తగూడెం పట్టణానికి చెందిన యువకుడు ఇక్కడ వసతి గృహంలో ఉంటూ గంజాయి విక్రయిస్తుండగా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం : నగరం విద్యాహబ్‌గా మారింది. పేరేన్నికగన్న విద్యాసంస్థలు ఉండటంతోపాటు ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నారు. ప్రస్తుతం పోటీ పరీక్షల ప్రకటనలతో నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి గదులు అద్దెకు తీసుకుంటుండగా, చాలామంది వసతిగృహాల్లో ఉంటున్నారు. నగరంలో సుమారు 150కి పైగా వసతి గృహాలుండగా వీటిలో కొన్ని మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తున్నాయి. చాలామటుకు నిబంధనలు పక్కనపెట్టి అనుమతిస్తున్నాయి. గంజాయి సరఫరాదారులు విద్యార్థుల వసతిగృహాల్లో ఉంటూ సరఫరా చేస్తున్నారు. తొలుత ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ విద్యార్థులు పరిచయమైన క్రమంలో వారికి కూడా అలవాటు చేస్తున్నారు. నయీంనగర్‌లోని రెండు వసతి గృహాల్లో అయిదుగురు విద్యార్థులు, సరఫరాదారుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు వసతి గృహాలకు నగర పాలక సంస్థ అనుమతులే లేవని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించి వాటి రద్దుకు సిఫార్సు చేశారు.

నిర్వహణ ఇలా ఉండాలి..

వసతి గృహం నిర్వహణకు నగరపాలకసంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి.ప్రజా భద్రత చట్టం ప్రకారం వసతి గృహం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.ప్రవేశాలు పొందేవారికి సంబంధించిన పూర్తి సమచారం ఆధార్‌ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు తీసుకుని రిజిస్టర్‌ నిర్వహించాలి. చదువుతున్న కళాశాల గుర్తింపు కార్డును తీసుకోవాలి. వ్యాపారం, ఉద్యోగం చేస్తే అందుకు సంబంధించిన పూర్తి సమాచారం నిర్వాహకులు ఆరా తీయాలి.

సమావేశం ఏర్పాటు చేస్తాం.. : - కిరణ్‌కుమార్‌, హనుమకొండ ఏసీపీ

వసతి గృహంలోఉన్న వారి పూర్తి సమాచారం నిర్వాహకుల వద్ద లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.వాటి పరిసర ప్రాంతాల్లో నిఘా పెడుతున్నాం. త్వరలో వసతి గృహాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. మత్తు పదార్థాలకు బానిసలైన వారి వివరాలను పోలీసులకు ఇస్తే వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మార్పు తెస్తాం.


కమిషనరేట్‌లో గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలు నివారించేందుకు సీపీ డాక్టర్‌ తరుణ్‌జోషి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. రెండు రోజుల కిందట అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం నివారణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున సైకిల్‌ ర్యాలీలు పోటీలు నిర్వహించారు. యువత మత్తుకు బానిస కావద్దంటూ వారిలో చైతన్యం, ఉత్సాహం కలిగించేలా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వసతిగృహాలపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు నగరవాసులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని