Telangana news : బూస్టర్‌డోసుల కాలపరిమితిని తగ్గించాలి : హరీశ్‌రావు

రాష్ట్రంలో మరోసారి జ్వర సర్వే నిర్వస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మరో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కేథ్‌ ల్యాబ్‌ సహా మరికొన్ని సేవలను హరీశ్‌రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు...

Published : 28 Jan 2022 15:48 IST

ఖమ్మం : రాష్ట్రంలో మరోసారి జ్వర సర్వే నిర్వస్తామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మరో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కేథ్‌ ల్యాబ్‌ సహా మరికొన్ని సేవలను హరీశ్‌రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరిన్ని వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకే పరిమితమైన గుండె సంబంధితి చికిత్సలని పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు ఇప్పటికే గాంధీ నిమ్స్‌, ఉస్మానియా ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆదిలాబాద్‌లోనూ అలాంటి సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. బూస్టర్‌ డోసుల కాలపరిమితిని తగ్గించాలని కేంద్రాన్ని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ‘‘ క్షతగాత్రులకు తక్షణ వైద్యసేవలు అందేలా ఖమ్మంలో 100 పడకల ట్రామాకేర్‌ సెంటర్‌ను ప్రారంభించాం. రాష్ట్రంలో తొలి మిల్క్‌ బ్యాంక్‌ నీలోఫర్‌ ఆస్పత్రిలో ఉంటే.. రెండో మిల్క్‌ బ్యాంక్‌ ఖమ్మంలో ప్రారంభించాం. ఖమ్మం ఆస్పత్రిలో త్వరలోనే కీమో థెరపీ, రేడియో థెరపీ సేవలను ప్రారంభిస్తాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని