ఐపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేశారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ వ్యక్తిగత

Published : 19 Jul 2021 17:28 IST

హైదరాబాద్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేశారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ.. ప్రభుత్వానికి లేఖ రాశారు. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుంచి వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు. ఓ పోలీసు అధికారిగా సేవలు అందించి ప్రవీణ్‌కుమార్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. పేదలకు నాణ్యమైన చదువు అందాలని భావించి, సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా భావించి ఆయన్ను ప్రోత్సహించడంతో..సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సమూల మార్పులు చేశారు. 

పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకిత భావంతో పని చేశానని చెప్పిన ప్రవీణ్‌కుమార్‌.. సంక్షేమ భవనంలో 9 సంవత్సరాల కాలం 9నిమిషాలుగా గడిచిపోయిందన్నారు. మరోవైపు పదవీ విరమణ తర్వాత అంబేడ్కర్‌, పూలె, కాన్షీరాం మార్గంలో నడిచి.. పేదలకు, పీడితులకు అండగా ఉండి భావితరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని