KTR: రైతులను రెచ్చగొట్టి వరి వేయించారు.. ఇప్పుడేమో నాటకాలాడుతున్నారు: కేటీఆర్‌

యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్ రైతులకు ముందే సూచించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. రైతులను రాష్ట్ర భాజపా నేతలు రెచ్చగొట్టి వరి వేయించారన్నారు. ఇప్పుడు యాసంగి ధాన్యం కొనమంటే..

Updated : 09 Apr 2022 16:29 IST

హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్ రైతులకు ముందే సూచించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. రైతులను రాష్ట్ర భాజపా నేతలు రెచ్చగొట్టి వరి వేయించారన్నారు. ఇప్పుడు యాసంగి ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు ఆడుతోందని కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని