KTR: పవన్‌ హన్స్‌ విక్రయంపై అనుమానాలు.. దీనికి ఎన్‌పీఏ ప్రభుత్వం సమాధానమేంటో?: కేటీఆర్‌

లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ విక్రయంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

Updated : 03 May 2022 18:36 IST

హైదరాబాద్: లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ విక్రయంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఆరు నెలల క్రితం ఏర్పాటైన ప్రైవేటు కంపెనీకి పవన్ హన్స్ సంస్థను అమ్మివేశారని కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. 2017లో పవన్ హన్స్ సంస్థ విలువ రూ.3,700 కోట్లు కాగా.. ఇప్పుడు అందులో 49 శాతం వాటా కేవలం రూ.211 కోట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎన్‌పీఏ (నాన్‌ ఫెర్మార్మింగ్‌ అలయన్స్‌) ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుందని కేటీఆర్ ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని