HYd News: బాలికపై లైంగిక దాడికి యత్నించిన మజ్లీస్‌ నేత... పోక్సో చట్టం కింద కేసునమోదు

ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మైనర్‌ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 13 ఏళ్ల బాలికపై జాంబాగ్‌కు చెందిన మజ్లీస్‌ నాయకుడు రఫిక్‌ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పటేల్‌నగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో..

Published : 18 Mar 2022 01:23 IST

హైదరాబాద్‌: ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మైనర్‌ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 13 ఏళ్ల బాలికపై జాంబాగ్‌కు చెందిన మజ్లీస్‌ నాయకుడు రఫిక్‌ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పటేల్‌నగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో ఉండే రఫిక్‌ .. బాలికను భయపెట్టి తన ఇంట్లోనే లైంగిక దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబ సభ్యులకు బాలిక విషయం తెలపడంతో రఫిక్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన బేగంబజార్‌ పోలీసులు నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రఫిక్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని