TS News: కొవిడ్‌ వ్యాప్తిపై ఆందోళన వద్దు.. రాష్ట్ర వ్యాప్తంగా 56వేల పడకలు: హరీశ్‌రావు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సం

Published : 23 Jan 2022 13:15 IST

సంగారెడ్డి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం భారతి నగర్‌లో జరుగుతున్న ఫీవర్‌ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో 56 వేల పడకలు అందుబాటులో ఉంచామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజులుగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. రెండు రోజుల్లో 29లక్షల 20వేల కుటుంబాలను సర్వే చేసి కరోనా లక్షణాలు ఉన్న లక్ష మందికి పైగా కిట్లు అందించినట్లు చెప్పారు.

ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. గర్భిణీలకు సైతం ఆసుపత్రుల్లో వసతులు అందుబాటులో ఉంచామని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్లు వాడి జాగ్రత్తలు తీసుకుంటే తెలంగాణలోనూ కొవిడ్‌ వ్యాప్తి తగ్గుతుందని వివరించారు. మరో నాలుగు రోజుల్లో ఫీవర్ సర్వే పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని