KTR: మంచి చేస్తే మెచ్చుకుంటాం..ఎన్నికలప్పుడే రాజకీయ వ్యూహాలు: కేటీఆర్‌

తెలంగాణకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి కేటీ రామారావు అన్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలతో నిత్యం మాట్లాడుతున్నామని చెప్పారు.

Updated : 06 Jun 2022 13:47 IST

హైదరాబాద్‌: తెలంగాణకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి కేటీ రామారావు అన్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలతో నిత్యం మాట్లాడుతున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమన్నారు. హైదరాబాద్‌లో ఇవాళ కేటీఆర్‌ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అనేక ఇబ్బందులు పడ్డాం. పొరుగురాష్ట్రాలతో పోటీపడి అనేక పరిశ్రమలు తెచ్చుకున్నాం. పారిశ్రామిక అభివృద్ధికి ‘ట్రిపుల్‌ ఐ’ మంత్ర కీలకమని గుర్తించాం. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ మా నినాదాలు. తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. ఎక్కడికి వెళ్లినా టీఎస్‌ ఐపాస్‌ గురించి మాట్లాడుతున్నారు. పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తే జరిమానా వేసే రాష్ట్రం మనదొక్కటే.

కొత్త పథకాలు తేవడం కాదు.. వాటిని కచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు తగినట్లు ముందుకు వెళుతున్నాం. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా మార్చుకున్నాం. మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రం బలంగా ఉంటేనే.. దేశం బలంగా ఉంటుంది. ఉత్పత్తి రంగం బలోపేతానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. కేంద్రం మంచి పని చేస్తే మెచ్చుకుంటాం.. చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం. ఎన్నికల సమయంలోనే రాజకీయ వ్యూహాలుంటాయి’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని