KTR: ఆ నిధులు తెస్తే కిషన్‌రెడ్డిని సన్మానిస్తాం: కేటీఆర్‌

నగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్లు నిధులు తేవాలని.. అలా తెస్తే పౌర సన్మానం చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహానగర

Updated : 16 Mar 2022 13:50 IST

ఎల్బీనగర్‌ అండర్‌పాస్‌, బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి

హైదరాబాద్‌: నగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రూ.10వేల కోట్లు నిధులు తేవాలని.. అలా తెస్తే పౌర సన్మానం చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహానగర అభివృద్ధికి భాజపా నేతలు పోటీపడాలని చురకలంటించారు. ఇవాళ ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్‌ కూడలిలో జీహెచ్‌ఎంసీ నిర్మించిన అండర్‌పాస్‌, బైరామల్‌గూడలో ఫ్లైఓవర్‌లను కేటీఆర్‌ ప్రారంభించారు. నాగోల్‌, బండ్లగూడలో నాలాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.

వరద ముంపు నివారణకు రూ.103 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేస్తామన్నారు. ఎల్బీ నగర్‌లో స్థలాల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడు నెలల్లో కొత్త పింఛన్లు ఇస్తామన్న మంత్రి.. అభివృద్ధి చేసేందుకు భాజపా కార్పొరేటర్లు కూడా ముందుకు రావాలన్నారు.

ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద రూ.40 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్‌ అండర్‌ పాస్‌, రూ. 29 కోట్లతో బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌లను నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని