Talasani: బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష

కరోనా కారణంగా రెండేళ్ల పాటు బోనాలు నిర్వహించుకోలేకపోయామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

Published : 07 Jul 2022 13:19 IST

హైదరాబాద్‌: కరోనా కారణంగా రెండేళ్ల పాటు బోనాలు నిర్వహించుకోలేకపోయామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఈనెల 17న సికింద్రాబాద్‌ మహంకాళి, 24న పాతబస్తీలో నిర్వహించే బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతం కంటే ఈసారి భక్తులు అధికారంగా వస్తున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఆషాఢం బోనాల ఉత్సవాలపై కమిటీ సభ్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 

18న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధాన ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని.. చార్మినార్‌ వద్ద 500 మంది కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బంది ఏర్పాటు చేసినట్లు తలసాని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని