Hyderabad: రసాభాసగా ఎన్‌ఎస్‌యూఐ సమావేశం.. బల్లలు, కుర్చీలు విసిరేసిన ఇరువర్గాలు

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రసాభాసగా జరిగింది. హైదరాబాద్ గాంధీభవన్‌ ఆవరణలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రెండు వర్గాలు విడిపోయి

Updated : 20 Apr 2022 18:18 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రసాభాసగా జరిగింది. హైదరాబాద్ గాంధీభవన్‌ ఆవరణలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రెండు వర్గాలు విడిపోయి బల్లలు, కుర్చీలు విసిరేసుకున్నారు. మూడేళ్లుగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను కొంతమంది నిలదీశారు. దీంతో పలువురు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌, ఉపాధ్యక్షురాలు చందనారెడ్డి సైతం వాగ్వాదానికి దిగారు.

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎలాంటి కమిటీలు నియమించకుండా వెంకట్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చందనారెడ్డి ఆరోపించారు. సమావేశంలో మాట్లాడుతుండగా వెంకట్ అనుచరులు అడ్డగించారని.. తమ అభిప్రాయాలు చెబితే బెదిరిస్తున్నారని చందనారెడ్డి మీడియా ముందు అవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెబుతుంటే కొందరు మీసాలు మెలేస్తున్నారని ఆమె మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని