osmania university: రేపట్నుంచి ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌పరిధిలో ఆన్‌లైన్‌ తరగతులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో రేపటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది.

Updated : 16 Jan 2022 14:37 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో రేపటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈనెల 30 వరకూ ఓయూ పరిధిలో ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతాయని తెలిపింది. డిగ్రీ, పీజీ తరగతులకు ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయని పేర్కొంది. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ పరిధిలోనూ రేపట్నుంచి ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయని జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు తెలిపారు. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా కోర్సులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రంలో కేసుల పెరుగుదల కొనసాగుతుండటంతో అన్ని విద్యాసంస్థలకు నేటితో ముగియనున్న సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని