Telangana news : ఆన్‌లైన్‌ బోధనపై వెనక్కి తగ్గిన వర్సిటీలు

ఆన్‌లైన్‌ బోధనపై తెలంగాణలోని యూనివర్సీటీలు వెనక్కి తగ్గాయి. రేపట్నుంచి ప్రత్యక్ష తరగతులే నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది. మరోవైపు జేఎన్‌టీయూహెచ్‌ కూడా

Published : 31 Jan 2022 21:18 IST

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బోధనపై తెలంగాణలోని యూనివర్సీటీలు వెనక్కి తగ్గాయి. రేపట్నుంచి ప్రత్యక్ష తరగతులే నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది. మరోవైపు జేఎన్‌టీయూహెచ్‌ కూడా ప్రత్యక్ష తరగతులే నిర్వహించనుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లోనూ ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌ ప్రత్యక్ష, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు సమాయత్తమయ్యాయి. ఈ నిర్ణయంపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. దీంతో ఈ రెండు వర్సిటీలు వెనక్కి తగ్గాయి. ప్రత్యక్ష తరగతులే నిర్వహిస్తామని ప్రకటిస్తూ.. విద్యార్థులంతా తరగతులకు హాజరవ్వాలని కోరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని