Pawan kalyan: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నారసింహ సందర్శనయాత్ర: పవన్‌

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కాంక్షిస్తూ నారసింహ సందర్శన యాత్ర చేపట్టనున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేన సోషల్‌ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో.....

Updated : 10 Feb 2022 04:22 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కాంక్షిస్తూ నారసింహ సందర్శన యాత్ర చేపట్టనున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేన సోషల్‌ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ‘‘దత్తపుత్రుడు అని పదే.. పదే విమర్శిస్తున్నారు. వైకాపా నాయకులకు ఒకటే చెప్పదల్చుకున్నా.. ప్రజలకు నేను దత్తపుత్రుడ్ని. ఉద్యోగుల సమస్య విపక్షాలు సృష్టించింది కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతామని వారిలో ఆశలు కల్పించారు. అందుకే.. వారికి రావాల్సిన విధానంలోనే వారు అడుగుతున్నారు. పీఆర్‌సీ అమలు చేయకపోవడంతో ఆగ్రహంతో ఉద్యోగులు నిరసన తెలిపితే .. జనసేనపై విమర్శలు చేయడం సరికాదు.

వైకాపా ప్రభుత్వం, నాయకులు ఏం చేసినా డూడూ బసవన్నలా తల ఊపేసి వెళ్లి పోవాలి. అలా .. కాదంటే, న్యాయమూర్తుల దగ్గరి నుంచి నల్ల బ్యాడ్జిలు పెట్టుకున్న టీచర్ల వరకు అందరూ మీకు శత్రువులుగానే కనిపిస్తారు. న్యాయంగా వారి హక్కుల గురించి మాట్లాడితే పట్టించుకోరు. ప్రభుత్వం పద్ధతిగా ఉంటే ఉద్యోగులు రోడ్లపైకి ఎందుకు వస్తారు? మంత్రులందరూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేయాలని కోరుకుంటాం. ఉద్యోగులకు న్యాయం చేయాలనే మా మద్దతు తెలిపాం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధినిని కాంక్షిస్తూ త్వరలో నారసింహ సందర్శన యాత్ర చేపడతా. దశల వారీగా నరసింహ క్షేత్రాల సందర్శనయాత్ర ఉంటుంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శంచుకున్నాక యాత్ర మొదలు పెడతా’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని