ICRISAT : ఇక్రిశాట్‌లో ప్రధాని మోదీ పర్యటన..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్రిశాట్‌ను సందర్శించారు. స్వర్ణోత్సవాల సందర్భంగా ఇక్రిశాట్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్‌ పరిశోధనలు

Updated : 05 Feb 2022 15:15 IST

హైదరాబాద్‌: ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. ప్రధానిని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్ జాక్వెలిన్‌ డి ఆరోస్‌ సన్మానించారు. ఇక్రిశాట్‌ పరిశోధనలు పురోగతిపై ప్రధానికి శాస్త్రవేత్తలు వివరించారు. సజ్జ, కంది, సెనగ, వేరుసెనగ, ఇతర చిరుధాన్యాలు విత్తన రకాలు, నాణ్యతపై ప్రధాని తెలుసుకున్నారు. కొత్త వంగడాల రూపకల్పన, రైతులకు చేరవేస్తున్న తీరుపై వివరించారు. ప్రధాని వెంట కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, నరేంద్రసింగ్ తోమర్‌, తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై ఉన్నారు. 

50 ఏళ్లుగా ఇక్రిశాట్‌ ఎన్నో సేవలు అందిస్తోందని సంస్థ డీజీ జాక్వెలిన్‌ తెలిపారు. మెట్ట పంటల గురించి ఇక్రిశాట్‌ అనేక పరిశోధనలు చేస్తోందన్నారు. మెట్ట పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని