
Published : 29 Jan 2022 02:13 IST
Telangana : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచుతూ తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. గతంలో ఖరారు చేసిన తేదీల ప్రకారం జనవరి 29 వరకు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. దాన్ని ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. ఆలస్య రుముములతో మార్చి 14 వరకు చెల్లించే అవకాశమిచ్చింది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆ ప్రకారం మే 20వ తేదీ తర్వాత మొదలవుతాయి.
Tags :