TS News: పోడు రైతులకు మద్దతుగా భాజపా పోరాటం: బండి సంజయ్‌

పోడు రైతులకు మద్దతుగా భాజపా పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి విస్మరించారని..

Updated : 19 Jan 2022 13:32 IST

హైదరాబాద్‌: పోడు రైతులకు మద్దతుగా భాజపా పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి విస్మరించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన భాజపా సమన్వయకర్తల సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు.

రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని పునరుద్ఘాటించారు. జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి అండగా ఉంటుందని తెలిపారు. గుర్రంపోడులో ఎస్టీ మోర్చా నేతలపై లాఠీఛార్జీ చేశారని సంజయ్‌ మండిపడ్డారు. 12 ఎస్టీ నియోజకవర్గాల్లో  పార్టీ పరిస్థితి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో భాజపా విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ మంత్రి రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని