Ts News: పని చేయించుకోకుండా జీతాలిస్తే ప్రజాధనం వృథా అయినట్లే: హైకోర్టు

ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగి నాగధర్‌ సింగ్ వేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన

Published : 18 Jan 2022 16:27 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత ఉద్యోగి నాగధర్‌ సింగ్ వేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పోస్టింగులు ఇవ్వకుండా ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయనందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేష్‌కుమార్‌పై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయకపోతే మార్చి 14న వ్యక్తిగతంగా హాజరుకావాలని సీఎస్‌ను ఆదేశించింది. పని చేయించుకోకుండా జీతాలు ఇస్తే ప్రజాధనం వృథా అయినట్లేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎంతమంది ఉద్యోగులు వెయిటింగ్‌లో ఉన్నారు.. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని