Ts News: రోజుకు లక్ష ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయండి: సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Published : 17 Jan 2022 12:29 IST

హైదరాబాద్‌: ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రోజుకు లక్ష ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది. కరోనా వ్యాప్తి నియంత్రణపై ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు విచారణ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని