Singareni: సింగరేణిని కేంద్రం అమ్మేయాలనుకుంటోంది!: కొప్పుల ఈశ్వర్‌

సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్రం సమాయత్తమవుతోందన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ..

Published : 25 Jan 2022 01:19 IST

హైదరాబాద్‌ : సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్రం సమాయత్తమవుతోందన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. కొత్త చట్టాలను తీసుకొచ్చి బలవంతంగా సంస్థలపై కేంద్రం రుద్దుతోందని విమర్శించారు. లాభాల్లో ఉన్న సంస్థలను నష్టాల్లో నడుస్తున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో రాష్ట్రానికి 51శాతం, కేంద్రానికి 49శాతం వాటలు ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నమన్న అహంకారంతో సంస్థ హక్కులను ఎన్డీయే ప్రభుత్వం కాలరాస్తోందని కొప్పుల విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని