Telangana News: తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెన్‌ ఎప్పుడంటే?

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే.

Updated : 29 Jan 2022 11:31 IST

హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు విద్యాశాఖ సెలవులు ఇవ్వగా.. కొన్ని రోజుల నుంచి పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. విద్యాసంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని.. ఈ నెల 31 నుంచి తెరుస్తారా? అని ఉన్నత న్యాయస్థానం ఆరా తీసింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టిన విచారణకు హాజరైన రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని చెప్పారు.

కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే కర్ఫ్యూ, తదితర ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలు తెరవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాఠశాలలను తెరిచేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర జనవరి 24 నుంచే స్కూళ్లను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని