CM Kcr: పోడు సాగుదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సీఎం ఆదేశం

పోడు భూముల సమస్య పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణతో పాటు హరితహారంపై తెలంగాణ

Updated : 23 Oct 2021 20:28 IST

హైదరాబాద్‌: పోడు భూముల సమస్య పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణతో పాటు హరితహారంపై తెలంగాణ సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ... అడవులపై ఆధారపడిన గిరిజనులకు మేలు చేయాలని, అడవులను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడవుల రక్షణలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నవంబరు 8 నుంచి డిసెంబరు 8వరకు పోడు భూములు సాగుచేస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.

‘‘నవంబరు 8లోపు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం గ్రామ కమిటీలు నియమించాలి. రెండు, మూడు గ్రామాలకు ఒక నోడల్‌ అధికారి ఉండాలి. గంజాయి సాగు చేసే వారికి రైతుబంధు, బీమా, విద్యుత్‌ బంద్‌ చేయాలి. గంజాయి సాగు చేసేవారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తాం. ఆర్వోఎఫ్‌ఆర్‌ భూముల్లో గంజాయి సాగుచేస్తే పట్టా రద్దు చేస్తాం. గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టాలి. గుడుంబా తయారీ దారులకు ఉపాధి, పునరావాసం కల్పించాలి’’ అని సీఎం ఆదేశించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో  పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని