Dalit bandhu: తెలంగాణ సాధించినట్లే.. దళితుల సమగ్రాభివృద్ధి సాధిస్తా: కేసీఆర్‌

దళితబంధు పథకంపై ఎప్పటినుంచో ప్రణాళిక ఉందని.. ప్రణాళిక కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గతేడాది మే నెలలో ప్రారంభం కావాల్సిన

Updated : 27 Aug 2021 16:19 IST

కరీంనగర్‌: దళితబంధు పథకంపై ఎప్పటినుంచో ప్రణాళిక ఉందని.. ప్రణాళిక కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గతేడాది మే నెలలో ప్రారంభం కావాల్సిన దళితబంధు పథకం కరోనా వల్ల అమలు ఆలస్యం అయిందన్నారు. దళిత బంధు అమలుపై కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా దళితచైతన్య జ్యోతి నిర్వహించానని.. ఎస్సీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసినట్లు కేసీఆర్‌ తెలిపారు. ఎస్సీల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి సమాజం కదిలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించినట్లే.. దళితుల సమగ్ర అభివృద్ధి సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన చివరి రక్తపుబొట్టు వరకు దళితుల కోసమే పోరాడతానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని