Ts News: తెరాస ప్లీనరీ ఫ్లెక్సీలు.. మంత్రి, మేయర్‌, ఎమ్మెల్యేకు జరిమానా

తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై విమర్శలు రావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. అనుమతి లేకుండా ఏర్పాటు

Updated : 09 Aug 2022 12:36 IST

హైదరాబాద్‌: తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై విమర్శలు రావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన  ఒక్కో ఫ్లెక్సీకి రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానాలు విధించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి ఈవీడీఎం (డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) వెబ్‌సైట్‌ పనిచేయలేదని, వెబ్‌సైట్‌ను ఇవాళ పునరుద్ధరించినట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఫ్లెక్సీల ఏర్పాటుకు బాధ్యులుగా గుర్తించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్ విజయలక్ష్మి‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జరిమానాలు విధించినట్టు అధికారులు తెలిపారు. ఈనెల 25న హైదరాబాద్‌ హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ సమావేశం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని