TS high court: దళితబంధు నిలిపివేతపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌

హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఇవాళ విచారణకు వచ్చాయి.

Updated : 25 Oct 2021 16:26 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఇవాళ విచారణకు వచ్చాయి. సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది. పథకం నిలిపివేతపై దాఖలైన మూడు ప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించి వాదనలు ముగియడంతో ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్‌, వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ సంస్థ.. దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. పథకం నిలిపి వేయాలన్న ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలని లక్ష్మయ్య, జడ్సన్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకాలను ఉప ఎన్నిక అయ్యే వరకు నిలిపి వేయాలని వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ సంస్థ కోరింది. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని