Ts News: ఎంపీలు పోరాడినా కేంద్రం వైఖరి మారలేదు.. యాసంగిలో వరి వద్దు: నిరంజన్‌రెడ్డి

యాసంగిలో రైతులు వరి వేయొద్దని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి మరోసారి రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

Published : 05 Dec 2021 16:47 IST

హైదరాబాద్‌: యాసంగిలో రైతులు వరి వేయొద్దని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి నిరంజన్‌రెడ్డి మరోసారి రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వరికి బదులు ఇతర  పంటలు వేస్తేనే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రత్యాయ్నాయ పంటలపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ‘‘ధాన్యం కొనుగోలు విషయంలో ఎంపీలు కేంద్రంతో పోరాడుతున్నారు. ఎంత పోరాడినా కేంద్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. ధాన్యం డబ్బులను కేంద్రం చాలా రోజులకు మంజూరు చేస్తోంది. ధాన్యం కొనుగోలులో రాష్ట్రాలకు సంబంధం లేకపోయినా.. రైతులు ఇబ్బంది పడవద్దని రాష్ట్ర ప్రభుత్వం ముందే చెల్లించేది. సేకరించిన ధాన్యాన్ని త్వరగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రానిదే. గతంలో బాయిల్డ్‌ రైస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది కేంద్రమే. రైతుల విషయంలో కేంద్రానిది అవకాశవాద ధోరణి. ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను కేంద్రం నీరుగారుస్తోంది. ఎఫ్‌సీఐని కూడా పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. అందుకే ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ షరతులు విధిస్తోంది’’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని