Published : 25/11/2021 19:09 IST

Ts News: తెలంగాణ సర్కార్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై కౌంటర్‌ దాఖలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయాన్ని కూల్చివేశారని.. కొత్త నిర్మాణాలు చేపట్టారని రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని