Dalit bandhu: దళిత బంధు అమలుకు మరో రూ.500 కోట్లు విడుదల

దళిత బంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌..

Updated : 26 Aug 2021 14:51 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసింది. విడతల వారీగా దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ఈ ప్రాజెక్టు అమలుకు మొత్తంగా రూ. 2వేల కోట్లు విడుదల చేసినట్లు అయింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం రూ. 2వేల కోట్లు కేటాయిస్తానని పథకం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా నిధులు విడుదల చేసిన అధికారులు.. ప్రాజెక్టు అమలుకు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని