Telangana Highcourt: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులిపేసుకున్నాయి: హైకోర్టు

గత ఏడాది వరదల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులిపేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది

Published : 06 Sep 2021 17:22 IST

హైదరాబాద్: గత ఏడాది వరదల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులిపేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. వరదల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వరద సాయం తమ పరిధిలోకి రాదని కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్‌ దాఖలుకు జాప్యం ఎందుకని కేంద్ర హోంశాఖను హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ్టి విచారణకు అడ్వొకేట్‌ జనరల్‌ ఎందుకు హాజరుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు ఏజీ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని